Multibagger Share: 10,000 పెట్టుబడి.. 20 ఏళ్ల కాలం.. రూ.1.3 లక్షల లాభం!
చివరి 20 ఏళ్లలో టాటా మోటార్స్ స్టాక్ ఇన్వెస్టర్లకు 1370 శాతం రిటర్న్ అందించింది. ఇన్వెస్టర్లు ఇందులో రూ.10,000 పెట్టుంటే ఇప్పుడు ఏకంగా రూ.1.4 లక్షలు అందుకొనేవాళ్లు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం టాటా మోటార్స్ స్టాక్‌లో గ్రోత్ కనిపిస్తోంది. చివరి 5-10 ఏళ్లలో మరింత ఎక్కువగా ఉంది. కంపెనీ వరుసగా కొత్త కార్లను ఉత్పత్తి చేస్తోంది. అందుకే చివరి ఐదేళ్లలో షేర్ ధర 144 శాతం ఎగిసింది.
టాటా మోటార్స్‌లో 2016లో పరివర్తన మొదలైంది. సవాళ్లను ఎదుర్కొంది. మొదట్లో ఎక్కువ వేరియెంట్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. రీస్ట్రక్చర్ చేశాక పరిస్థితి మారింది.
టాటా మోటార్స్ సేల్స్‌పై దృష్టి సారించింది. సరఫరా గొలుసులో మార్పులు చేసింది. ఖర్చులు తగ్గించుకుంది. నికర లాభం పెరగడం మొదలైంది. ప్యాసెంజర్ వెహికిల్స్‌లో అగ్రగామిగా మారింది.
టియాగో, అల్ట్రోజ్, ట్రిగోర్ వంటి హ్యాచ్ప్యాక్లు సఫారీ, నెక్సాన్, హ్యారియర్ వంటి ఎస్‌యూవీలతో టాటా మోటార్స్ దూసుకెళ్తోంది. ఏడాది క్రితం రూ.5007 కోట్ల నష్టాల నుంచి ఇప్పుడు రూ.3203 కోట్ల నికర లాభాన్ని టాటా మోటార్స్ నమోదు చేసింది.