Multibagger Shares: సెల్లింగ్ ప్రెజర్ ఉన్నా ఇన్వెస్టర్ల డబ్బును డబుల్ చేసిన 2 టాటా గ్రూప్ షేర్లు!
Multibagger Shares: ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఫలితంగా గ్లోబల్, ఇండియన్ ఎకానమీలో అస్థిరత నెలకొంది. అయినప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేస్తూనే ఉంటాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMultibagger Shares: ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ టాటా గ్రూప్‌నకు చెందిన రెండు స్టాక్స్ ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేశాయి. ఈ మధ్యే 52 వారాల కనిష్ఠానికి చేరుకున్నప్పటికీ రెండేళ్ల కాలంలో డబ్బుల్ని రెట్టింపు చేశాయి. అవే టీసీఎస్, టాటా స్టీల్.
Multibagger Shares: టాటా స్టీల్ షేరు నెల రోజుల్లో 18 శాతం పతనమైంది. కమోడిటీ ధరలు పెరగడంతో సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటోంది. అయినప్పటికీ రెండేళ్లలో అద్భుతంగా రాణించింది. 2020, ఏప్రిల్ 3న రూ.253గా ఉన్న షేరు ప్రస్తుతం రూ.900 పైనే ట్రేడ్ అవుతోంది. బుధవారం రూ.1183 వద్ద ముగిసింది.
Multibagger Shares: సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఐటీ స్టాక్స్ ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి. అయినప్పటికీ టీసీఎస్ మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. 2020, ఏప్రిల్ 3న రూ.1654గా ఉన్న షేరు ధర రెండేళ్లలో 105 శాతం రిటర్న్ ఇచ్చింది. ప్రస్తుతం రూ.3460 వద్ద కొనసాగుతోంది.
Multibagger Shares: ఈ రెండు షేర్లు మెరుగైన రాబడి ఇవ్వడంతో ఇన్వెస్టర్లు సంతోషిస్తున్నారు. ఒడుదొడుకులకు లోనైనప్పటికీ చక్కని రిటర్న్స్ ఇచ్చినందుకు సంబర పడుతున్నారు. కాగా దీర్ఘ కాలంలో ఈక్విటీ మార్కెట్లు సంపద సృష్టించే సంగతి అందరికీ తెలిసిందే.