Multibagger stock: లక్ష రూపాయల్ని రూ.14 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ షేరు!
Multibagger stock Rajesh Exports: ఇన్వెస్టింగ్ ఒక ఆర్ట్! మంచి కంపెనీల్లో సుదీర్ఘ కాలం మదుపు చేస్తున్నవారికి ఎప్పుడూ లాభమే! అలా పెట్టుబడి పెట్టిన వారిని కొన్ని షేర్లు కోటీశ్వరులుగా మార్చాయి. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ అలాంటిదే!
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMultibagger stock Rajesh Exports: రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేరు ఇన్వెస్టర్ల ఇంట సిరులు కురిపించింది. 21 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు మదుపు చేసిన వారిని ఇప్పుడు కోటీశ్వర్లుగా మార్చింది. అక్షరాల రూ.10 కోట్లు అందించింది.
Multibagger stock Rajesh Exports: 2001లో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేరు ధర రూ.2.10గా ఉంది. అప్పట్లో లక్ష రూపాయలు పెడితే 47,619 షేర్లు వచ్చాయి. 2008లో కంపెనీ 2:1 నిష్పతిలో బోనస్ షేర్లు ఇచ్చింది. అంటే 47,619 షేర్లు 1,42,857గా మారాయి.
Multibagger stock Rajesh Exports: ప్రస్తుతం రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు రూ.752 రేంజులో కొనసాగుతున్నాయి. ఈ ధరతో 1,42,857 షేర్లను లెక్కిస్తే రూ.10,74,28,464 లేదా రూ.10.74 కోట్లుగా అవుతుంది. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే సంపన్నులు అవ్వడం ఖాయం! ఈ కంపెనీ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.994. ఇదే విలువతో లెక్కిస్తే రూ.14.19 కోట్లు అవుతుంది. సాధారణ ఇన్వెస్టర్లు ఊహించనంత లాభమిది.
Multibagger stock Rajesh Exports: కేంద్ర ప్రభుత్వ పెట్టిన పీఎల్ఐ స్కీమ్‌కు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఎంపికైంది. ఏసీసీ ఎనర్జీ స్టోరేజ్ ప్రైవేటు లిమిటెడ్ అనే 100 శాతం సబ్సిడరీ కంపెనీ పేరుతో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్‌ను ఉత్పత్తి చేయబోతోంది. భవిష్యత్తులో కంపెనీ లాభదాయకత బాగానే ఉంటుందని నిపుణులు అంచనా.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.