Multibagger Stock: రెండేళ్లలో రూ.లక్షకు రూ.18.25 లక్షల రిటర్న్ ఇచ్చిన మల్టీబ్యాగర్
కొవిడ్ రాకతో చాలా షేర్లు కనిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఆంక్షలు తొలగించడంతో కొన్ని కంపెనీలు అనూహ్యంగా రాణించాయి. కొన్నేమో మల్టీ బ్యాగర్లుగా అవతరించి మదుపర్లకు డబ్బు పంచాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబోరోసిల్ (borosil shares) రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ అలాంటిదే. రెండేళ్ల కాలంలోనే ఇది రూ.36 నుంచి రూ.650కి చేరుకుంది. దాదాపుగా 1725 శాతం ర్యాలీ చేసింది.
చివరి నెలలో బోరోసిల్ షేరు రూ.557 నుంచి రూ.650కి చేరుకుంది. 16 శాతం రాణించింది. చివరి 6 నెలల్లో రూ.330 నుంచి రూ.650కు ఎగిసింది. అంటే 100 శాతం ర్యాలీ అయింది. ఇక ఏడాదిలో 165 శాతం రాణించి రూ.245 నుంచి రూ.650, రెండేళ్లలో 1725 పెరిగి రూ.35 నుంచి రూ.650కి చేరుకుంది.
బోరోసిల్ షేర్లలో నెల రోజుల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.1.16 లక్షలు చేతికి అందేవి. ఆరు నెలల క్రితం పెట్టుంటే నేడు రూ.2 లక్షలుగా మారేవి. ఏడాది క్రితం లక్ష పెట్టుంటే ఇప్పుడు రూ.2.65 లక్షలు చేతికి వచ్చేవి. అదే రెండేళ్ల క్రిత రూ.లక్ష పెట్టుంటే నేడు రూ.18.25 లక్షలు అందుకొనేవారు.
ప్రస్తుతం బోరోసిల్ కంపెనీ మార్కెట్ విలువ రూ.8500 కోట్లుగా ఉంది. బుక్ వాల్యూ 47గా ఉంది. ఈ కంపెనీ లైఫ్‌టైం హై రూ.745 కాగా 52 వారాల కనిష్ఠం రూ.213గా ఉంది.