IPO Multibaggers: రెండేళ్లలో 248% రిటర్న్ - క్రేజీ ఐపీవోలు!
అయినప్పటికీ చివరి రెండేళ్లలో ఐపీవోకు వచ్చిన కంపెనీల్లో 18 ఏకంగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించాయి. మినిమం 50 శాతానికి పైగా ప్రాఫిట్ ఇచ్చాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహరి ఓమ్ పైప్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 248 శాతం రిటర్న్ అందించింది. ఇన్వెస్టర్ల ఇంట డబ్బుల వర్షం కురిపించింది. పరాస్ డిఫెన్స్ 197 శాతం గెయిన్‌తో రెండో ప్లేస్‌లో నిలిచింది. 130 కోట్ల రూపాయల విలువతో వచ్చిన హరి ఓమ్ పైప్ ఇండస్ట్రీస్ ఐపీవోను 7.39 రెట్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
40 శాతం ప్రీమియంతో స్టాక్ మార్కెట్లలో లిస్టైన ఈ కంపెనీ మల్టీ ఫోల్డ్ రిటర్న్ ఇచ్చింది. 2023లో ఇప్పటి వరకు 47 శాతం రిటర్న్ ఇవ్వడం గమనార్హం.
హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఈ కంపెనీ ఐరన్, స్టీల్ పైపుల్ని తయారు చేస్తుంది. స్టీల్ బిల్లెట్స్, పైప్స్, ట్యూబ్స్, హాట్ రోల్డ్ కాయిల్స్, స్కాఫోల్డింగ్ సిస్టమ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది.
2021 చివర్లో పరాస్ డిఫెన్స్ 171 కోట్ల రూపాయల విలువతో ఐపీవోకు వచ్చింది. ఆఫర్ పీరియడ్‌లో 304 రెట్ల మంది సబ్‌స్క్రైబ్ చేయడం ప్రత్యేకం. దాంతో 171 శాతం ప్రీమియంతో ఈ షేర్లు మార్కెట్లో లిస్టయ్యాయి. ఇక వీనస్ పైప్స్, డేటా ప్యాటర్న్స్, రోలెక్స్ రింగ్స్ వరుసగా 178, 172, 119 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.
మ్యాక్రోటెక్ డెవలపర్స్, కిమ్స్, దేవయాని ఇంటర్నేషనల్, లేటెంట్ వ్యూ అనలిటిక్స్, అదానీ విల్మార్ 100 నుంచి 75 శాతం మేర రాబడి అందించాయి. సోనా బీఎల్డబ్ల్యూ ప్రిసెషన్, మెట్రో బ్రాండ్స్, క్లీన్ సైన్స్ టెక్నాలజీ వంటి కంపెనీలు కనీసం 50 శాతం మేర రిటర్న్ ఇచ్చాయి.
చివరి రెండేళ్లలో 150 కంపెనీలు ఐపీవోకు వచ్చి రూ.2 లక్షల కోట్ల రూపాయలను సేకరించాయని ప్రైమ్ డేటాబేస్ తెలిపింది. 2022లో ఫైనాన్షియల్ ఇయర్లో రూ.1.3 లక్షల కోట్లు పబ్లిక్ ఇష్యూస్ ద్వారా ఫండ్ రైజింగ్ చేయగా 2023లో అది రూ.62,265 కోట్లకు పడిపోయింది.