Household Financial Assets: ప్రజలు 2022లో ఎంత డబ్బు ఎక్కడ దాచుకున్నారో తెలుసా? మీరు ఊహించిందేమీ కాదు!
కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తారు. అవసరాలకు వాడుకోగా మిగిలిన డబ్బును ఆదా చేసుకుంటారు. స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, ప్రావిడెంట్ ఫండ్ల వంటి పథకాల్లో పెట్టుబడి పెడతారు. దేశవ్యాప్తంగా 2022లో ఎందులో ఎంత పెట్టుబడి పెట్టారో మీకోసం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజలు డబ్బు దాచుకొనేందుకు ఎక్కువగా ఆధారపడేది వాణిజ్య బ్యాంకుల మీదే. 2022లో 25.68 శాతం డబ్బు అంటే రూ.6,51,700 కోట్లను బ్యాంకుల్లో దాచుకున్నారు. సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టారు.
బ్యాంకింగేతర కంపెనీల్లో 1.64 శాతం డబ్బును దాచుకున్నారు. ఇది రూ.41,600 కోట్లు. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్, ఇతర కార్పొరేట్ డిపాజిట్లలో ఈ సొమ్ము మదుపు చేశారు.
ప్రావిడెంట్, పెన్షన్ ఫండ్లలో 22.92 శాతం అంటే రూ.5,81,700 కోట్లు దాచుకున్నారు. జీవిత బీమా కోసం 17.37 శాతం డబ్బు కేటాయించారు. రూ.4,40,800 కోట్లు వెచ్చించారని ఆర్బీఐ తెలిపింది.
మ్యూచువల్ ఫండ్లలోనూ బాగానే పెట్టుబడి పెడుతున్నారు. 6.33 శాతం డబ్బు వినియోగించారు. అంటే రూ.1,60,600 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఏటా పెరుగుతున్న సిప్ ఆధారిత పెట్టుబడులే ఇందుకు ఉదాహరణ.
పోస్టాఫీసు, చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ప్రజలు 13.43 శాతం డబ్బు దాచుకున్నారు. రూ.3,40,700 కోట్లు కేటాయించారు. సుకన్య వంటి డిపాజిట్లు ఇందులోకే వస్తాయి.
నగదు రూపంలో రూ.2,69,700 కోట్లు దాచుకున్నారు. మొత్తం డబ్బులో ఇది 10.63 శాతం కావడం గమనార్హం.
స్టాక్ మార్కెట్, కో ఆపరేటివ్ బ్యాంకు డిపాజిట్లకు స్వల్ప మొత్తమే కేటాయించారు. ఈక్విటీ పెట్టుబడులు రూ.48,600 (1.92 శాతం), కో ఆపరేటివ్ బ్యాంకు డిపాజిట్లు రూ.2,200 (0.09%)గా ఉన్నాయి.