Loan from Google Pay: అర్జంట్‌గా డబ్బు కావాలా? గూగుల్ పేను అడగండి మరి!
Loan from Google Pay: అత్యవసరంగా డబ్బులు కావాలా? బ్యాంకుల కన్నా రీజనబుల్‌గా వడ్డీ తీసుకొనే పర్సనల్ లోన్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారా? అయితే 'గూగుల్ పే' నుంచి సత్వరమే రూ.లక్ష వరకు రుణం తీసుకోవచ్చు. మిగతా వాటితో పోలిస్తే కాస్త తక్కువ వడ్డీకే గూగుల్ పే (Google Pay) వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLoan from Google Pay: ఈ మధ్యే డీఎంఐ ఫైనాన్స్ లిమిటెడ్ (DMI Finance Limited)తో గూగుల్ పే (G Pay) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు కంపెనీలు కలిపి డిజిటల్‌గా వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తున్నాయి.
Loan from Google Pay: గూగుల్ పే (Google Pay) ద్వారా రూ.లక్ష వరకు వెనువెంటనే డిజిటల్‌గా రుణం పొందొచ్చు. ఈ రుణాన్ని గరిష్ఠంగా మూడేళ్లు అంటే 36 నెలల్లో తీర్చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం దేశంలోని 15000 పిన్‌కోడ్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
Loan from Google Pay: గూగుల్ పే (Google Pay) నుంచి లోన్ పొందాలంటే మొదట మీరు ఆ కంపెనీకి పాత కస్టమర్ అయి ఉండాలి. క్రెడిట్ స్కోరు బాగుండాలి. అప్పుడే రుణం మంజూరు చేస్తారు. ముందుగానే అర్హత పొందిన యూజర్లు డీఎంఐ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రుణం పొందొచ్చు.
Loan from Google Pay: గూగుల్ పే లోన్‌కు (Google Pay Loan) ఎక్కువ టైం పట్టదు. రియల్ టైంలోనే దరఖాస్తులను అప్రూవ్ చేస్తారు. ఆమోదం పొందిన కొద్ది సమయంలోనే లక్ష రూపాయాలు గూగుల్ పేకు కనెక్టైన బ్యాంకు ఖాతాలో పడతాయి.