Gold Investment: బంగారం కొనేటప్పుడు చేసే పెద్ద తప్పులివే! ఎన్ని రెట్లు నష్టపోతున్నారో చూడండి!
Gold buying mistakes: బంగారం! భారతీయులు అత్యంత ఇష్టపడే ఖనిజం. ఆడవాళ్లు నగలు, సంపాదనా పరులు మరింత రాబడి కోసం సువర్ణంపై పెట్టుబడి పెడుతుంటారు. కానీ చాలామంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGold buying mistakes: అసలు నగలను పెట్టుబడిగా భావించొద్దని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఒకవేళ బంగారం కొని దాచాలనుకుంటే బులియన్ కాయిన్లు లేదా బిస్కెట్ రూపంలో తీసుకోవడం మంచిది. నగల రూపంలో పెట్టుబడి పెడితే తరుగు రూపంలో కొంత నష్టం వాటిల్లుతుంది.
Gold buying mistakes: ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు, ఈక్విటీ మార్కెట్లు పతనం అవుతున్నప్పుడు బంగారంపై పెట్టుబడి పెడుతుంటారు. హెడ్జ్‌గా పనికొస్తుందని భావిస్తుంటారు. కాలం గడిచే కొద్దీ బంగారం విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుందని అనుకుంటారు. నిజానికి ఇదో భ్రాంతిగా చెబుతున్నారు విశ్లేషకులు.
Gold buying mistakes: ఉదాహరణకు 40 ఏళ్ల క్రితం అంటే 1981లో 10 గ్రాముల బంగారం రూ.1800 ఉండేది. 2021లో దాని విలువ రూ.48,720కి పెరిగింది. దాదాపుగా 29 రెట్లు లాభం. కానీ అదే సమయంలో 173 పాయింట్లు ఉన్న సెన్సెక్స్ 2021లో 49,509కి పెరిగింది. ఏకంగా 338 రెట్లు లాభం! దీన్ని బట్టి బంగారం కన్నా ఈక్విటీపై ఎక్కువ రాబడి వస్తుందని అర్థమవుతోంది.
Gold buying mistakes: ఒకవేళ మీ పెట్టుబడిలో కొంత భాగం బంగారంపై పెట్టాలనుకుంటే సౌర్వభౌమ పసిడి బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఏటా రెండున్నర శాతం వడ్డీ ఇస్తారు. ఎనిమిదేళ్ల తర్వాత అప్పటి బంగారం విలువకు సమానంగా డబ్బులు ఇస్తారు. అన్నేళ్లు ఒపిక పట్టలేకపోతే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫిజికల్ గోల్డ్ కన్నా ఇలా కొనుగోలు చేయడమే మంచిదని చెబుతున్నారు.