Cooking Oil Prices: 5 లీటర్ల నూనె డబ్బా ఉందా? రూ.250కి పెరగనున్న వంటనూనె!!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎవరికి మేలు చేస్తుందో తెలీదు కానీ భారతీయులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. వంట నూనె ఇంట్లో మంట పెడుతోంది. ధరల పెరుగుదలను తట్టుకోలేక కస్టమర్లు లబోదిబో అంటున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపొద్దుతిరుగుడు ముడి నూనెను ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్ నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం వల్ల సరఫరా దెబ్బతింది. దాంతో వంట నూనె ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం లీటర్ వంటనూనె ధర సగటు రూ.200గా ఉంది.
కంపెనీని బట్టి 5 లీటర్ల నూనె డబ్బా రూ.1000 నుంచి 1300 వరకు ఉంటోంది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో కస్టమర్లు ఇప్పుడే స్టాక్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. దాంతో డీమార్ట్ వంటి స్టోర్లలో నూనె కొరత ఉంటోంది. ఐదు లీటర్ల డబ్బాలు అసలు కనిపించడం లేదు.
రాబోయే కాలంలో వంట నూనె ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లీటర్ నూనె ధర ఏకంగా రూ.250కి చేరుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
తమ దేశంలో పెరిగిన నూనె ధరలను అదుపులో ఉంచేందుకు ఇండోనేసియా పామ్ ఆయిల్ ఎగుమతులను నిలిపివేసింది. భారత్ పామాయిల్ అవసరాలు అక్కడి దిగుమతుల ద్వారానే తీరుతాయి. ఇప్పుడు నిషేధం విధించడంతో మన దేశంలో ధరలు 10-15 శాతం పెరుగుతాయని అంచనా. అంటే సగటు వినియోగదారుడి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది!! (All Images: pixabay)