Bank Holidays October 2022: అక్టోబర్లో బ్యాంకులకు 21 రోజులు సెలవులు! డబ్బులు చూసుకోండి!
అక్టోబర్ నెల బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ వచ్చేసింది. ఈసారి బ్యాంకులకు ఏకంగా 21 రోజులు సెలవులు వచ్చాయి. పర్వదినాలు, జాతీయ దినోత్సవాలు ఉండటమే కారణం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆర్బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఆర్టీజీఎస్, బ్యాంక్స్ క్లోజింగ్ అకౌంట్స్ చట్టాల ప్రకారం సెలవులు ఇస్తారు.
బ్యాంకు సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కొన్ని సెలవులు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. ప్రాంతాలను బట్టి అక్టోబర్లో 21 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
ఆదివారం కాబట్టి అక్టోబర్ 2, 9, 16, 23, 30న వారాంతపు సెలవులు ఉన్నాయి. రెండు, నాలుగో శనివారం కాబట్టి అక్టోబర్ 8, 22న సెలవులు.
గాంధీ జయంతి, మహా అష్టమి, మహా నవమి, విజయ దసమి, కర్వా చౌత్, నరక చతుర్ధశి, దీపావళి, గోవర్ధన పూజ, భాయిదూజ్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి నేపథ్యంలో 2, 3, 4, 5, 6, 7, 8, 13, 14, 18, 24, 25, 26, 31న సెలవులు.