4 Day Work Week UK: జీతం తగ్గలేదు.. పని పెరగలేదు - అక్కడ వారానికి 4 రోజులే ఆఫీసు!
ఐటీ ఇండస్ట్రీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విదేశాల్లో వారానికి ఐదు రోజులే పని! బ్రిటన్‌లోని వంద కంపెనీలు వర్కింగ్ డేస్‌ను నాలుగుకు కుదించాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజీతంలో కోత పెట్టకుండా, పని గంటలను పెంచకుండానే నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని సూచించాయి. ఈ కొత్త విధానాన్ని కంపెనీల్లో పర్మనెంట్ గా అమలు చేయాలని నిర్ణయించాయి.
పని దినాలు తగ్గడంతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, ఉత్పాదకతలో మార్పులేదని కంపెనీలు వెల్లడించాయి. ఈ విధానాన్ని అమలు చేస్తున్న వంద కంపెనీల్లో రెండు పెద్ద కంపెనీలూ ఉన్నాయని ది గార్డియన్’ఓ కథనాన్ని ప్రచురించింది.
యూకేలో ఆటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్ పెద్ద కంపెనీలు. ఒక్కో దాంట్లో దాదాపు 450 పైగా ఉద్యోగులు ఉన్నారు. కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ పనితీరు మరింత మెరుగైందని అవిన్ సీఈవో ఆడమ్ రాస్ వెల్లడించారు.
నాలుగు రోజుల పని కావడంతో ఉద్యోగులు హ్యాపీగా పనిచేస్తున్నారని రాస్ చెప్పారు. నిపుణులు, అనుభవజ్ఞులు తమ వద్దే పనిచేసేందుకు మొగ్గు చూపిస్తున్నారని వెల్లడించారు. వలసలు తగ్గాయని వివరించారు.
కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్, బోస్టన్ యూనివర్సిటీల పరిశోధకులు సుమారు 3300 మంది ఉద్యోగులు ఉన్న 70 కంపెనీలలో నాలుగు రోజుల ఫలితాలను పరిశోధిస్తున్నారు. ప్రపంచంలోనే ఉద్యోగాల పరంగా అతిపెద్ద పైలట్ ప్రాజెక్టుగా దీనిని పేర్కొంటున్నారు.