Salaries of IT CEOs: టీసీఎస్ సీఈవో సాలరీ రూ.25 కోట్లు - టాప్5లో కంపెనీ సీఈవోల్లో ఎవరికి ఎక్కువ?
ఐటీ కంపెనీల్లో ఎక్కువ సాలరీ అందుకుంటున్నది హెచ్‌సీఎల్ సీఈవో సీ విజయకుమార్. 2022లో ఆయన రూ.123.13 కోట్ల మేర వార్షిక వేతనం అందుకున్నారు. స్థిర, చర వేతనాలు చెరో రెండు మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిప్రో కంపెనీ సీఈవో థెర్రీ డెలాపోర్ట్ ఏడాదికి రూ.79.8 కోట్లు తీసుకుంటున్నారు. రాబోయే వార్షిక ఏడాదిలో ఆయన సాలరీ మరింత పెరగనుంది.
ఇన్ఫోసిస్ సైతం గ్లోబల్ స్టాండర్డ్స్‌లో పే చేస్తోంది. సీఈవో సలిల్ పారేఖ్ 2022లో రూ.71.02 కోట్లను వార్షిక వేతనంగా పొందారు.
టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని 2022లో రూ.63.4 కోట్లు ఆర్జించారు. 2021తో పోలిస్తే ఏకంగా 189 శాతం పెరిగింది.
టీసీఎస్ సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేశారు. 2021-22లో ఆయన రూ.25.75 కోట్లు వార్షిక వేతనంగా పొందారు. అంతకు ముందుతో పోలిస్తే 27 శాతం పెరిగింది.