Car Buyers: కార్ బయర్స్ కొత్త ట్రెండ్! చిన్న కార్లు వద్దే వద్దంటున్న కస్టమర్లు!
ప్యాసెంజర్ వెహికిల్స్ మార్కెట్లో 2021 ఆర్థిక ఏడాదిలో కాంపాక్ట్, మిడ్ సైజ్ కార్లు 47 నుంచి 52 శాతానికి పెరిగాయని ఇండియన్ ఆటో మొబైల్ మానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ (SIAM) తెలిపింది. ఇదే సమయంలో మినీ, మైక్రో కార్ల వాటా 31 నుంచి 26 శాతానికి పడిపోయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజల ఆదాయంలో పెరుగుదల, తక్కువ వడ్డీరేట్లు, వ్యక్తిగత రవాణా సాధానాలకు మొగ్గు చూపడటం, కొత్త మోడళ్లు అందుబాటులో ఉండటం, కొనుగోలుదారుల ఇష్టాల్లో మార్పులు రావడమే ఇందుకు ట్రెండ్ మార్పుకు కారణమని నిపుణులు, ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
కాంపాక్ట్, మిడ్ సైజ్ సెగ్మెంట్లో హ్యూందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ బాలెనో, టాటా నెక్సాన్, మహీంద్రా థార్‌కు ఎక్కువ పాపులారిటీ కనిపిస్తోంది.
ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ఇందులో కొన్ని మోడళ్లకు ఆరు నెలల వరకు వెయిటింగ్ పీరియెడ్ ఉందని కంపెనీలు చెబుతున్నాయి.
భవిష్యత్తులోనూ కస్టమర్లు పెద్ద కార్ల వైపే వెళ్తారని విశ్లేషకులు అంటున్నారు. వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాల నుంచి చిన్న కార్లు అట్నుంచి ప్రీమియం హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్, ఎస్‌యూవీలు కొంటారని ధీమాగా ఉన్నారు.