Indian banks: మోసపోయిన సొమ్ము రూ.4.69 లక్షల కోట్లు! బ్యాంకుల రిపోర్ట్!
దేశవ్యాప్తంగా 2014-2023 మధ్య 65,017 బ్యాంకు మోసాలు జరిగాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అజయ్ వాసుదేవ్ సమాచార హక్కు దరఖాస్తుకు జవాబు ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ పదేళ్ల కాలంలో మోసాల వల్ల బ్యాంకులు రూ.4.69 లక్షల కోట్ల వరకు నష్టపోయాయి. ఇవన్నీ ఒక లక్ష రూపాయాలకు మించి మోసపోయిన కేసులే.
చివరి మూడేళ్లలో ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఫ్రాడ్ కేసులు కనిపించాయని ఆర్బీఐ వార్షిక నివేదిక 2022-23 తెలిపింది. అయితే ఎక్కువ సొమ్ము నష్టపోయింది మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకులే.
డిజిటల్ పేమెంట్లు, కార్డు/ఇంటర్నెట్ చెల్లింపుల మోసాలు ఎక్కువగా నమోదు అయ్యాయి. విలువ పరంగా చెప్పాలంటే రుణాల విభాగంలో అధిక మోసాలు జరిగాయి.
2020-21తో పోలిస్తే 2021-22లో బ్యాంకు మోసాల్లో ఇరుక్కున్న సొమ్ము భారీగా తగ్గింది. 55 శాతం తగ్గినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇక 2021-22తో పోలిస్తే 2022-23లో ఇవి 49 శాతానికి తగ్గాయి.