Flipkart Employees: 25,000 ఉద్యోగులకు జాక్‌పాట్! 700 మిలియన్ డాలర్లు పంచుతున్న ఫ్లిప్‌కార్ట్!
ఒకవైపు ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు పోతాయన్న భయం, కొందరు ఇప్పటికే ఉపాధి కోల్పోయారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు వేల మందిని ఇంటికి పంపించేశాయి. ఇలాంటి కష్టకాలంలో ఫ్లిప్‌కార్ట్ ఓ శుభవార్త చెప్పింది!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజా, మాజీ ఉద్యోగులకు వన్ టైమ్ పేమెంట్ కింద 700 మిలియన్ డాలర్లు పంచబోతున్నారు. మాతృసంస్థ నుంచి ఫోన్‌పేను స్పిన్ ఆఫ్ చేయడమే ఇందుకు కారణం. ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఫోన్‌పేలో గతంలో పనిచేసిన, ప్రస్తుత ఉద్యోగులకు డబ్బులు చెల్లించనున్నారని తెలిసింది.
కంపెనీలో స్టాక్ ఆప్షన్లు ఉన్న ఉద్యోగులకే ఈ నగదు లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ టాప్ 20 ఉద్యోగులు, అత్యంత సీనియర్లు, మొదట ఉద్యోగంలో చేరినవారికే 700 మిలియన్ డాలర్లలో 200 మిలియన్ డాలర్లు దక్కుతాయని సమాచారం.
వాల్‌మార్ట్ సహా ఫ్లిఫ్‌కార్టులో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు ఈ నగదును చెల్లిస్తున్నారు. ఇప్పటికైతే కంపెనీ దీనిపై అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. ఫ్లిప్‌కార్ట్ అందించిన ఈ సంపద సృష్టి అవకాశం దేశంలోనే అతి పెద్దదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఈక్విటీ లేదా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్‌తో పోలిస్తే ఇప్పుడిస్తున్న పేఔట్ భిన్నమైంది. ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగుల నుంచి షేర్లను కొనుగోలు చేయకుండానే ఫోన్‌పే లావాదేవీల రూపంలో డబ్బులు ఇస్తోంది. ఫోన్‌పే నుంచి యాజమాన్య విభజన పూర్తైందని, ఆ సంస్థ పూర్తి విలువను అన్‌లాక్ చేసేందుకే ఇలా చేశామంది.