Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Tata Curvv EV Top Features: టాటా కర్వ్ ఈవీలోని ఈ టాప్ విషయాల గురించి మీకు తెలుసా?
టాటా కర్వ్ EV ఆగస్టు 07న మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ సరికొత్త ఎస్‌యూవీ కూపే డిజైన్‌తో ఇది అడుగుపెట్టింది. ఈ కొత్త EV ప్రస్తుతం టాటా ఎలక్ట్రిక్ మోటార్స్ లోనే ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంది. ఎందుకంటే ఇది నెక్సాన్ EV కంటే భారీ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్లాట్‌ఫామ్: కర్వ్ EV కూడా పంచ్ మాదిరిగానే acti.ev ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. దీనిలో 500 లీటర్ల బూట్ స్పేస్, ముందు భాగంలో 11 లీటర్ ఫ్రంక్ స్పేస్‌ని కలిగి ఉంటుంది.
రేంజ్: 45kWh బ్యాటరీ ప్యాక్ 502 km క్లెయిమ్ చేసిన పరిధిని కలిగి ఉండగా, 55kWh బ్యాటరీ ప్యాక్ 585km ARAI సర్టిఫైడ్ రేంజ్‌ని అందిస్తుంది. టాటా మోటార్స్ వాస్తవ రేంజ్ మాత్రం 400-450 కి.మీగా ఉంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 67hp మరియు 215Nm ను విడుదల చేస్తుంది.
బ్యాటరీలు: ఇది రెండు బ్యాటరీ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. అవి 45kWh బ్యాటరీ మరియు 55kwh బ్యాటరీ ప్యాక్‌గా ఉన్నాయి. కర్వ్ ఈవీ 45 బ్యాటరీ ప్యాక్ ధర రూ. 17.49 లక్షలు మరియు 55 బ్యాటరీ ప్యాక్ ధర రూ 19.25, అలాగే టాప్-ఎండ్ 55 kWh బ్యాటరీ ప్యాక్ వెర్షన్ ధర రూ. 21.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.
ఇంటీరియర్ ఫీచర్లు: ఇంటీరియర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, ఫిజిటల్ కంట్రోల్ ప్యానెల్, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ విత్ మూడ్ లైటింగ్, ఇ-షిఫ్టర్, మల్టీ మూడ్ యాంబియంట్ లైటింగ్ ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు: 360 డిగ్రీ కెమెరా, ADAS లెవెల్ 2, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ మరియు హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉన్నాయి.
ఎక్స్‌టీరియర్ డిజైన్: ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, R18 అల్లాయ్ వీల్స్, యానిమేషన్‌తో కూడిన స్మార్ట్ డిజిటల్ కనెక్ట్ చేయబడిన DRLs, స్మార్ట్ ఛార్జింగ్ యానిమేషన్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లు, LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, కార్నరింగ్ ఫంక్షన్‌తో LED ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు, స్మార్ట్ డిజిటల్ యానిమేషన్‌తో కనెక్ట్ చేయబడిన LED టెయిల్ ల్యాంప్స్, ఆటో ఓపెన్/క్లోజింగ్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఫ్రంట్ ఛార్జింగ్ లిడ్ ఉన్నాయి.
వారంటీ & కలర్స్: బ్యాటరీ ప్యాక్ మరియు మోటార్‌కు 1.6 లక్షల కిమీ లేదా 8 సంవత్సరాల వారంటీ ఉంది. ఇది ఐదు కలర్ ఆప్షన్స్‌తో వస్తుంది.