Skoda Kushaq Slavia And Kylaq :స్కోడా కార్లలో సీట్ బెల్ట్ సమస్య: మీ కారులో ఉందా? వెంటనే చెక్ చేసుకోండి!
స్కోడా కంపెనీకి చెందిన కైలాక్, కుషాక్, స్లావియా కార్లను వెనక్కి రప్పించాలని సంస్థ నిర్ణయించింది. వాటి సీట్ బెల్టులో లోపాలు ఉన్న్నాయని గ్రహించి ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2021- మే 2025 మధ్య తయారైన మూడు వేరియెంట్ వాహనాల్లో సమస్య ఉన్నట్టు గ్రహించింది. ఇప్పటి వరకు వాహనాలలో దాదాపు 860 యూనిట్లలో సమస్య ఉన్నట్టు తేల్చారు.
ఇలా స్కోడా సంస్థ తన కార్లలో సమస్య ఉందని రీకాల్ చేయడం ఇద్ మొదటిసారి కాదు గత ఏప్రిల్‌లో కూడా కొన్ని మోడల్స్‌లో సమస్య ఉందని వెనక్కి రప్పించింది. ఏప్రిల్‌లో వెనుక సీటు బెల్ట్‌లో సమస్య ఉందని కొన్ని మోడల్స్‌ను వెనక్కి రప్పించింది. ఇప్పుడు మాత్రం ముందుసీటు బెల్ట్‌సమస్య ఉన్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు వాటిని తనిఖీ చేసి సరి చేయబోతోంది.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోటివ్ తయారీదారుల (SIAM) చెప్పిన వివరాలు పరిశీలిస్తే... వెనుక సీట్ బెల్ట్ నాణ్యతపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. మెటల్ బేస్ ఫ్రేమ్ చాలా డెలికేట్‌గా ఉందని పగిలిపోవచ్చని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. సీట్లు బెల్ట్ ఫిటింగ్‌లో కూడా లోపం ఉన్నట్టు గ్రహించారు.
దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మోడల్ కార్లు వాడుతున్న వినియోగదారులు సమీపంలోని షోరూమ్‌కు వెళ్లి వాహనాలను చెక్ చేయించుకోవాలని SIAM సూచిస్తోంది. లేకుంటే భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
కియా సోనెట్, టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV 3XOతో పోటీగా కైలాక్ కారును స్కోడా సంస్థ తీసుకొచ్చింది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా ,VW వర్టస్ తో తలపడేందుకు స్కోడా స్లావియాను రంగంలోకి దించింది. స్కోడా కుషాక్‌ను హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి కాంపాక్ట్ SUV లతో మార్కెట్‌లో ఢీ కొట్టేందుకు తీసుకొచ్చింది.