✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ వచ్చేసింది - క్లాస్ లుక్‌లో ఎలా ఉందో చూశారా?

ABP Desam   |  20 Jan 2024 12:00 AM (IST)
1

రోల్స్ రాయిస్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్ స్పెక్టర్‌తో భారతీయ మార్కెట్‌లోని ఈవీ విభాగంలో ఎంట్రీ ఇచ్చింది. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ధరను రూ.7.5 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. స్పెక్టర్ ఎలక్ట్రిక్ సెడాన్ భారతదేశంలో ఉన్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.

2

ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో 102 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. ఇది ప్రతి యాక్సిల్‌పై రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో పెయిర్ అవ్వడం విశేషం. ఇది 585 బీహెచ్‌పీ పవర్‌ను, 900 ఎన్ఎం మిక్స్‌డ్ అవుట్‌పుట్‌ను కూడా జనరేట్ చేయగలదు. ఇది 195 కేడబ్ల్యూ ఛార్జర్‌ను కూడా కలిగి ఉంది. ఈ కారు కేవలం 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కానుంది.

3

దీంతో పాటు ఆప్షనల్‌గా 50 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఛార్జర్‌తో పెడితే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి దగ్గర దగ్గర 95 నిమిషాల సమయం వరకు పడుతుంది.

4

ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 530 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని రోల్స్ రాయిస్ అధికారికంగా ప్రకటించింది. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 530 కిలోమీటర్ల పాటు ప్రయాణించవచ్చన్న మాట. స్పెక్టర్ ఎలక్ట్రిక్ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం కలిగి ఉంది.

5

ఈ ఈవీ బరువు 2,890 కిలోలు కావడం విశేషం. దీన్ని ఆల్ అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌పై బిల్డ్ చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫాంటమ్, కల్లినన్, ఘోస్ట్ కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌పైనే డెవలప్ చేశారు. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ పొడవు 5,475 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 2,017 మిల్లీమీటర్లుగా ఉంది.

6

ఇంటీరియర్ గురించి చెప్పాలంటే ఈ కారు వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ టోన్ ప్రీమియం ఇంటీరియర్స్, డోర్లు, డ్యాష్‌బోర్డ్‌పై ఇల్యూమినేటెడ్ ప్యానెల్‌లు, అప్హోల్స్టరీ, ఇంటీరియర్ ప్యానెల్స్ కోసం కస్టమైజేషన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆటో
  • రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ వచ్చేసింది - క్లాస్ లుక్‌లో ఎలా ఉందో చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.