Used Cars: ఢిల్లీలో కాలం చెల్లిన కార్లు ఏ రాష్ట్రాల్లో తిప్పేందుకు అనుతిస్తున్నారు? నియమాలు ఏంటీ?
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఢిల్లీలో 1 జులై 2025 నుంచి కాలం చెల్లిన వాహనాలు అంటే EOL (ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్) రోడ్లపైకి రానివ్వడం లేదు. ఒకవేళ అలా జరిగితే వాటికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. దీని ప్రభావంతో ఢిల్లీలోని దాదాపు 60 లక్షలకుపైగా వాహనాలు రోడ్డుపైకి రావడం లేదు.
ఢిల్లీలో 15 ఏళ్లకుపైబడిన పాత పెట్రోల్ కార్లు పూర్తిగా పనికి రాకుండా పోతాయా అంటే అలా కాదు. ఆ కార్లను తీసుకొచ్చి వేరే రాష్ట్రాల్లో నడపవచ్చు. కానీ దీనికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
15 సంవత్సరాల పాత పెట్రోల్ కార్లను ఢిల్లీలో నడపలేరు. కానీ వాటిని ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నడపవచ్చు. అయితే, ఈ రాష్ట్రాల్లోని వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా పాటించాలి.
ఢిల్లీలో 15 సంవత్సరాల పాత పెట్రోల్ కారును వేరే రాష్ట్రానికి తీసుకెళ్లినప్పుడు, మీరు మొదట ఆ రాష్ట్రంలో కారును రిజిస్టర్ చేయాలి. కానీ చాలా జిల్లాల్లో ఇలాంటి పాత వాహనాలను రిజిస్ట్రేషన్ చేయడం లేదు.
కానీ మీరు 5 సంవత్సరాల పాత పెట్రోల్ కారును నమోదు చేసుకోగల జిల్లాల్లో కూడా ఒక ప్రక్రియ అనుసరించాలి. మొదట మీరు ఢిల్లీ ప్రభుత్వం నుంచి NOC పొందాలి. ఆ తర్వాత ఇతర రాష్ట్రంలో నమోదు చేసుకోవాలి.
అంతేకాకుండా, కారు Eol వ్యవధి ముగిసేలోపు మీరు NOC పొందాలి. అప్పుడే మీరు దానిని మీరు మీ రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకోగలరు. మీరు ఈ నిబంధనలను గుర్తుంచుకుంటే, మీరు ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాల పాత పెట్రోల్ కారును సులభంగా నడపగలరు.