Hyundai Creta Electric: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఫస్ట్ ఫొటోలు వచ్చేశాయ్ - ఎలా ఉందో చూశారా?
లాంచ్‌కు ముందు హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ కారు గురించి ఒక చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర కూడా జనవరి 17వ తేదీనే వెల్లడి అవుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు మిడ్ వేరియంట్ 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది 390 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
టాప్ వేరియంట్ క్రెటా ఎలక్ట్రిక్ 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను కూడా పొందుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌తో కారు 473 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ టాప్ ఎండ్ వెర్షన్‌లోని మోటార్ 171 బీహెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 7.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు.
ఈ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారులో కొత్త స్టీరింగ్ వీల్ ఉంది. ఈ కారు 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దానితో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇన్‌స్టాల్ చేశారు.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లోని స్టోరేజ్ స్థలం కారు ముందు భాగంలో అందుబాటులో ఉంది. ఈ కారులో 22 లీటర్ల ట్రంక్ ఉంది. ఈ కారును DC ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 80 నిమిషాలు పడుతుంది. అయితే 11 కేడబ్ల్యూ వాల్ బాక్స్ ఛార్జర్‌తో ఈ కారు నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.