కొత్త రేంజ్ రోవర్ ఫస్ట్ లుక్ రివ్యూ: ఏ రేంజ్‌లో ఉందంటే?
మనదేశంలో కొత్త 2022 రేంజ్ రోవర్ డెలివరీలు ప్రారంభం అయ్యాయి. మోస్ట్ అవైటెడ్ లగ్జరీ కార్లలో ఈ లేటెస్ట్ రేంజ్ రోవర్ కూడా ముందంజలో ఉంది.
ఎంఎల్ఏ ఫ్లెక్స్ బాడీ ఆర్కిటెక్చర్‌పై ఈ కారును సంస్థ రూపొందించింది. స్టాండర్డ్, లాంగ్ వీల్ బేస్ ఆప్షన్లను ఈ కారులో అందించనున్నారు. దీంతో నాలుగు, ఐదు, ఏడు సీటర్ల కాన్పిగరేషన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
3.0 లీటర్ల డీజిల్, 3.0 లీటర్ల పెట్రోల్, 4.4 లీటర్ల పెట్రోల్ ఆప్షన్లలో దీన్ని లాంచ్ చేశారు.
ఈ కారులో 13.1 అంగుళాల కర్వ్‌డ్, ఫ్లోటింగ్ స్క్రీన్‌తో పాటు 13.7 అంగుళాల ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది.
పవర్ అసిస్ట్ డోర్స్, 35 స్పీకర్ల ఆడియో సిస్టం, వెనకవైపు యాక్జిల్ స్టీరింగ్, టెర్రెయిన్ రెస్పాన్స్ 2 సిస్టం, ఇండిపెండెంట్ ఎయిర్ సస్పెన్షన్ వంటి హైలెట్ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
ఈ మోడల్‌లో ఫస్ట్ ఎడిషన్ మోడల్స్ ధర రూ.2.38 కోట్లు కాగా, ఆటో బయోగ్రఫీ మోడల్ ధర రూ.3.3 కోట్ల నుంచి ప్రారంభం కానుంది.
ఈ కొత్త రేంజ్ రోవర్ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీల్లో ఒకటి.
రోల్స్ రాయిస్, బెంట్లేల సరసన చేరడానికి రేంజ్ రోవర్‌కు ఇదే చక్కటి అవకాశం. ఈ కారు మంచి ఆదరణ దక్కించుకుంటే ఆ బ్రాండ్ల సరసన చేరినట్లే.