అర చేతిలో లైఫ్ లైన్ ఇలా ఉంటే.. వారు మరణానికి ముందు ఇంటికి దూరంగా వెళ్ళిపోతారు!
హస్తరేఖ శాస్త్రం ప్రకారం మీ అరచేతిలో చూపుడు వేలు - బొటనవేలు మధ్య భాగం నుంచి 3 రేఖలు వస్తాయి. ఇందులో మూడవది జీవిత రేఖ.
ఎవరి చేతిలోనైనా పొడవైన , లోతైన జీవిత రేఖ ఉంటే, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారని అర్థం. వ్యాధులతో పోరాడే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది, రోగనిరోధక శక్తి బాగుంటుంది.
ఒకవేళ జీవిత రేఖను కత్తిరించే విధంగా అరచేతిలో చాలా చిన్న చిన్న రేఖలు ఏర్పడితే, మీ జీవితంలో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది, మీరు జీవితంలో ఏదో ఒక వ్యాధితో బాధపడతారు.
స్పష్టమైన , లోతైన జీవిత రేఖ కలిగిన వ్యక్తులు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారు. చాలా తక్కువగా అనారోగ్యానికి గురవుతారు.
ఏ వ్యక్తుల అరచేతిలో జీవిత రేఖ చివరి భాగం రెండు భాగాలుగా విభజించబడి ఉంటుందో.. వారు ఏదో ఒక కారణం చేత తమ మరణానికి ముందు ఇంటికి దూరంగా వెళ్ళిపోతారు.
ఎవరి చేతి రేఖ చివరిలో క్రాస్ గుర్తు ఉంటుందో వారి జీవిత చరమాంకంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.