Horoscope Today 18th December 2022: ఈ రాశివారు అనవసర వాదనలకు దూరంగా ఉండాలి
మేష రాశి ఈ రాశి విద్యార్థులకు మంచి రోజు. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవృషభ రాశి ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంలో ప్రశాంతతను కాపాడాలి అనుకుంటే..అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆర్థిపరమైన కష్టాలున్నాయి జాగ్రత్త. కోపాన్ని అదుపుచేసుకోవడం మంచిది.
మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజు మీరు స్నేహితులు, ప్రియమైన వారిని కలిసే అవకాశం ఉంది. సోదరులతో సాన్నిహిత్యం ఉంటుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కలవరపరుస్తాయి
కర్కాటక రాశి ఈ రాశివారు కోపం తగ్గించుకోవాలి, మాట అదుపుచేసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి రానివ్వవద్దు. ఆహారం విషయంలో సమయాన్ని పాటించాలి. చిన్నచిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. మీ గౌరవం పెరుగుతుంది.
సింహ రాశి ఈ రాశివారు ఇతరుల పట్ల ఆకర్షితులవుతారు. ఈ రోజు మీకు మంచి రోజు. కొత్త పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మతపరమైన పనులకోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
కన్యా రాశి ఈ రాశివారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలనే ఆలోచనతో తొందరపాటుతో వ్యవహరించవద్దు. కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. శారీరన అనారోగ్యం బాధపెడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త.
తులా రాశి తెలియని వ్యక్తులను త్వరగా నమ్మేయవద్దు. ఇంటికి మరియు పిల్లలకు సంబంధించిన శుభవార్త వింటారు. పాత స్నేహితులను కలవడం ఆనందంగా అనిపిస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. ఖర్చులు తగ్గించండి.
వృశ్చిక రాశి ఈ రాశికి చెందిన వారికి ఈ రోజు ప్రయోజనకరమైన రోజు. వ్యాపారులు పురోగతి చెందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
ధనుస్సు రాశి ఈ రాశి వారు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో సమన్వయం ఏర్పడుతుంది. పై అధికారులతో మాటలు, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండండి. శారీరక అస్వస్థత, మానసిక ఆందోళన అలాగే ఉంటాయి. వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది
మకర రాశి తెలియక పెద్ద పొరపాటు జరగొచ్చు. ఈరోజు కోపం, మాటల పట్ల నిగ్రహం అవసరం. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటం మంచిది.
కుంభ రాశి మీ పని ఏదీ ముందుగా పూర్తికాదు కాబట్టి మీ వంతు కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. భాగస్వాములతో సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆకస్మిక ఖర్చులు ఇబ్బంది పెడతాయి. సమయానికి ధనం చేతికందుతుంది
మీన రాశి ఈ రోజు ఉత్తముల పరిచయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విశ్వాసంతో అడుగేస్తే విజయం సాధిస్తారు. తలపెట్టిన ప్రతిపనీ విజయంవంతం అవుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మాట తూలకండి.