In Pics: హరియాణా సీఎం ఖట్టర్‌తో జగన్ భేటీ - మర్యాదపూర్వకంగానే కలిశారా!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరిషికొండలోని పెమ వెల్నెస్ రిసార్టులో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు.
ఉదయం 10.25 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సీఎం జగన్ విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లారు.
11.30 గంటలకు విశాఖకు చేరుకున్నారు.
ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ నగర మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి తదితరులు స్వాగతం పలికారు.
మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, కలెక్టర్ కూడా సీఎం జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అక్కడి నుంచి 12.10 గంటలకు రిషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్‌కు వెళ్లారు.
ఇక్కడ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు.
ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.