Sreeleela : సింహాచలేశుని సన్నిధిలో శ్రీలీల - అప్పన్న స్వామిని దర్శించిన హీరోయిన్
స్టార్ హీరోయిన్ శ్రీలీల సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. రాజాంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె ఆ తర్వాత దగ్గర్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు.Image Source : Vamsikaka Instagram
విశాఖలోని కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించారు. అనంతరం సింహాచలం అప్పన్న ఆలయానికి వెళ్లారు.Image Source : Vamsikaka Instagram
ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీలీలకు వేదాశీర్వచనం అందించారు. ఆ తర్వాత ఆలయంలో కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్నారు.Image Source : Vamsikaka Instagram
శ్రీలీలకు వేదాశీర్వచనం తర్వాత స్వామి వారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అధికారులు అందజేశారు.Image Source : Vamsikaka Instagram
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికొస్తే హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస మూవీస్‌తో దూసుకెళ్తున్నారు. Image Source : Vamsikaka Instagram
రీసెంట్‌గా రవితేజ మాస్ జాతరలో నటించగా... ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. Image Source : Vamsikaka Instagram