Revanth Reddy Lokesh Meeting: మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు హాజరైన రేవంత్ రెడ్డి, నారా లోకేష్, ఎన్వీ రమణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న రేవంత్ రెడ్డికి ఏపీ నేతలు స్వాగతం పలికారు.
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఏపీ మంత్రి లోకేష్, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
రేవంత్ రెడ్డి, నారా లోకేష్, ఎన్వీ రమనణతో పలువురు టీడీపీ నేతలు, కూటమి నేతలు, ప్రముఖులు నూతన దంపతులను ఆశీర్వదించారు.
వివాహ వేడుకలో సరాదాగా రేవంత్ రెడ్డి, నారాలోకేష్ మాటా మంతి. రాజకీయాలు పక్కన పెట్టి సరదాగా చర్చించుకున్న ఫొటో వైరల్ అవుతోంది.
మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు హాజరైన రేవంత్ రెడ్డి, నారా లోకేష్, ఎన్వీ రమణ
దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన రేవంత్ రెడ్డి, నారా లోకేష్