In Pics: చిరు, పవన్ కల్యాణ్‌తో మోదీ ఉత్సాహం! ఫ్యాన్స్‌కు భలే కిక్ - ఫోటోలు
విజయవాడలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఇదే వేదికపై నుంచి పవన్ కల్యాణ్ తో పాటుగా మొత్తం 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి బీజేపీ నేతలు, బీజేపీ, మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
ఇటు సినిమా రంగం నుంచి కూడా దిగ్గజ నటులు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. పవన్ కల్యాణ్ తరపున మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కావడం.. మెగా అభిమానులను మరింతగా ఆకర్షించింది.
అటు నందమూరి ఫ్యామిలీ, నారా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాల కారణంగా తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా హాజరయ్యారు.
తొలుత చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో గవర్నర్ ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఆప్యాయంగా పలకరించారు.