Samantha Ruth Prabhu Photos: ఓ వైపు ఆశ్రమాలు మరోవైపు ప్రకృతిలో ప్రయాణం ఇంకోవైపు కెరీర్...సమంత చాలా బిజీ!
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. గ్లామరస్ పాత్రలతోపాటు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.
తాజాగా మలయాళ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమాతో ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించబోతుందని టాక్. సామ్, మమ్ముట్టి ఇప్పటికే ICL Fincorp యాడ్‌లో కనిపించారు.
తేడాది గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ఫీ మేల్ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేదు. ఆ తర్వాత విజయ్ విజయ్ దేవరకొండతో కలిసి ఖుషిలో నటించింది. ఆ మూవీ తర్వాత అనారోగ్య కారణాలతో చిన్న బ్రేక్ తీసుకున్న సామ్ మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతోంది
ఎక్కువగా టూర్‌లకు, ఆశ్రమాలకు వెళ్లే సామ్..రీసెంట్ గా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు వెళ్లిన పిక్స్ షేర్ చేసింది. ‘గురువు, మెంటార్ కోసం మనలో చాలామంది వెతుకుతుంటారు. జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి.... ఎందుకంటే మన రోజువారీ జీవితంలో అనేక సంఘటనలు మనపై ప్రభావితం చూపుతుంటాయి. వాటిలో ఏవి సాధారణం, ఏవి అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. అలాంటి వాటి గురించి కేవలం తెలుసుకోవడమే కాదు.. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితంలో అమలుచేయడం కూడా ముఖ్యమే’ అని పోస్ట్ పెట్టింది..
samantha ruth prabhu latest Photos
samantha ruth prabhu latest Photos