YS Jagan: వైసీపీ కోరిక మేరకే ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ ప్రమాణం, రాజకీయం వద్దన్న టీడీపీ
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరణ పరిమాణం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరగా ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.
మొదట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అనంతరం ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి 11 మంది మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రతిపక్ష హోదా రావాలంటే 17 మంది సభ్యులు ఉండాలి. అయితే వైసీపీ రిక్వెస్ట్ మేరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కాకుండా.. మంత్రుల అనంతరం జగన్ తో ప్రమాణం చేయడానికి అనుమతి ఇచ్చారు. ప్రమాణ స్వీకారం విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దాంతో వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దాంతో వైఎస్ జగన్ ఈ అయిదేళ్లు సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు.