Vangaveeti Radha Engagement Photos: వంగవీటి రాధా, పుష్పవల్లి నిశ్చితార్థం ఫొటోలు చూశారా!
దివంగత నేత వంగవీటి మోహనరంగా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీ నేత వంగవీటి రాధా, పుష్పవల్లిల వివాహం పెద్దలు నిశ్చయించారు. ఇరు వైపుల బంధువుల సమక్షంలో ఆదివారం (సెప్టెంబర్ 3న) వంగవీటి రాధా, పుష్పవల్లిల నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది.
నర్సాపురం పట్టణానికి చెందిన జక్కం పుష్పవల్లితో రాధా కృష్ణకు వివాహం ఖాయం చేశారు. త్వరలో వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహం జరగనుడటంతో వంగవీటి అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది.
పుష్పవల్లి ఎవరంటే.. ఏలూరు మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మాని బాబ్జీల చిన్న కుమార్తె జక్కం పుష్పవల్లినే వధువు.
వంగవీటి రాధా వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ 22న సాయంత్రం వంగవీటి రాధా, పుష్పవల్లిలు వివాహ బంధంలో ఒక్కటి కానున్నారు.