Kishan Reddy Tour: విజయవాడలో కిషన్ రెడ్డి 'జన ఆశీర్వాద యాత్ర'.. సీఎం జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి
విజయవాడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’లో పాల్గొన్నారు.
యాత్రలో భాగంగా విజయవాడలో జరిగిన సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చేస్తోందని వివరించారు.
370 ఆర్టికల్ రద్దు చేశామన్నారు. చైనా ఎన్ని కుట్రలను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా తిప్పికొడుతోందని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోందన్నారు. పాక్ చర్యలను తిప్పికొడతామన్నారు.
దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారని, దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు.
విజయవాడలో ఆశీర్వాద సభ ముగించుకుని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
కనకదుర్గమ్మ ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు హకారం అందిస్తానని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్రమంత్రిని సీఎం జగన్ ఆహ్వానించగా.. ముఖ్యమంత్రిని కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.