In Pics: జవాన్ సాయితేజ అంతిమయాత్ర ఫోటోలు.. హాజరైన వేలాది మంది జనం
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసాయితేజ పార్థివదేహం ఉదయం 5.45 గంటలకు బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు జిల్లాకు చేరుకుంది. పుంగనూరు రోడ్డు మార్గం గుండా ఆయన స్వగ్రామంమైన ఎగువరేగడకు ర్యాలీగా చేరుకుంటుంది.
ముందుగా ఆయన అభిమానులు, స్నేహితులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పుంగనూరు మార్గం వద్దకు చేరుకుని అక్కడ నివాళి అర్పించారు.
భౌతిక కాయం 9:30 గంటల సమయానికి మదనపల్లి శివారులో వద్దకు చేరుకొంది. మదనపల్లి పట్టణం అంగళ్ళు మిట్స్ కాలేజీ, విశ్వం కాలేజీల మీదుగా ఎగువ రేగడ గ్రామానికి దాదాపు 25 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి గ్రామానికి చేరుకుంది. ఈ ర్యాలీ దాదాపు రెండు గంటల పాటు సాగింది.
ఎగువ రేగడ గ్రామంలో కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్ధం ఉంచి మధ్యాహ్నం సాయితేజ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
మరోవైపు సాయితేజ నివాసం వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సైనిక లాంఛనాలతో సాయితేజకు కడసారి తుది వీడ్కోలు ఇండియన్ ఆర్మీ పలకనుంది.
దాదాపుగా ఐదు రోజుల అనంతరం సాయితేజ పార్ధిదేహం స్వగ్రామంకు చేరుకుంది.. హిందూ సాంప్రదాయం ప్రకారం సాయితేజకు అంతిమ సంస్కారం చేయనున్నారు కుటుంబ సభ్యులు.