Balakrishna Relaunches Anna canteen: హిందూపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ Photos చూశారా
టీడీపీ నేతృత్వంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన తరువాత తొలిసారిగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం లో పర్యటించారు. పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలోని సుగురు ఆంజనేయస్వామి దేవాలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
64వ బర్త్‌డే సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఏపీలో మరోసారి తొలి అన్న క్యాంటీన్‌ను హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు పేట్రేగిపోయాయని అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీ ప్రజలు వారికి తగిన శాస్తి చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని భయాందోళనలకు కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. వారి మాట వినకపోతే దాడులు చేయడం లేకపోతే హత్యలు చేసేవారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సునామి వచ్చే ముందు నిశ్శబ్దం ఎలా ఉంటుందో ఏపీలో ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజలు అంతే సైలెంట్ గా ఉండి, ఓటు రూపంలో వైసీపీ నేతల అహాన్ని అణచివేశారన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.
2014 నుంచి టీడీపీ ప్రభుత్వంలో హిందూపురంను అభివృద్ధి చేశానన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. కానీ 2019లో నెగ్గిన వైసీపీ పాలనలో అభివృద్ధి అనేది లేదన్నారు. అందుకే తాజా ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి ఇంటికి పంపించారని ఎద్దేశా చేశారు.