Nara Lokesh: రాజోలు యువగళం క్యాంప్ వద్ద లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం యువగళం క్యాంపు కార్యాలయం వద్ద నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రబాబును సీఐడీ అరెస్టు చేయడంతో తండ్రిని చూసేందుకు లోకేష్ విజయవాడ బయలుదేరడానికి సిద్ధమయ్యారు.
ఈలోగా పోలీసులు రాజోలు యువగళం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. లోకేష్ ని కదలనీయకుండా అడ్డుకున్నారు.
శాంతిభద్రతల సమస్య వస్తుందని, నారా లోకేశ్ ను విజయవాడకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు.
తండ్రిని చూసేందుకు వెళ్లనీయకుండా అడ్డుకోవడం దారుణం అంటూ పోలీసులపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.
క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపైనే నారా లోకేశ్ బైటాయించి నిరసనకు దిగారు.
'పిచ్చోడు లండన్‌కి, మంచోడు జైలుకి. ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. ఎఫ్ఐఆర్లో పేరు లేదు, ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలియదు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వేయడం సాధ్యం కాదు' అని లోకేశ్ ట్వీట్ చేశారు.