Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Pawan Kalyan: దళితులకు, కాపులకు మధ్య చిచ్చు పెట్టాలనే అనంతబాబుకు జగన్ ప్రోత్సాహం: పవన్ కళ్యాణ్
తన దగ్గర పనిచేస్తున్న దళిత యువకుడు సుబ్రమణ్యంను కిరాతకంగా హత్య చేసి, మృత దేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును సీఎం వైఎస్ జగన్ కావాలనే వెనకేసుకొస్తున్నాడని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతబాబుకు వ్యక్తిగతంగా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు కానీ.. అతడి సామాజిక వర్గం అయిన కాపులకు మాత్రం చాలా నష్టం జరుగుతోందని పవన్ పేర్కొన్నారు. అతడ్ని ప్రోత్సహించడం ద్వారా దళితులను మరింత రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
అనంతబాబు కాపు కాబట్టి అతడిపై ద్వేషం కాకుండా, కాపులపై దళితులకు ద్వేషం పెరగాలని సీఎం జగన్ అసలు కుట్ర అని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతబాబునును వెనకేసుకురావడం ద్వారా కాపులకు, దళితులకు చిచ్చు పెట్టాలని.. కాపులపై దళితుల్లో ఆగ్రహం నింపాలనేది జగన్ ప్లాన్ అన్నారు.
కాకినాడ లోక్ సభ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభలను భారీ మెజారిటీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టం అందరికీ ఒక్కటే కానీ. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ ఒకేలా పని చేయాలన్నారు పవన్ కళ్యాణ్. జనం గొంతు అయిన జనసేన గొంతు పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రజల బాధలను, సమస్యలను వినిపిస్తే దాని తీరే వేరు అన్నారు.
తాను ప్రధాని మోదీతో ఏ విషయం మీద అయినా మాట్లాడగలను. మోదీని సంపూర్ణంగా గౌరవిస్తానని పవన్ పేర్కొన్నారు. కానీ కాకినాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కు జగన్ అంటే భయమని జనసేనాని ఆరోపించారు.
జగన్ లాంటి వ్యక్తి వెళ్లి ప్రధాని మోదీని కలిస్తే.. రాష్ట్ర సమస్యల గురించి కాకుండా, తనను కాపాడండి అని మాత్రమే అడుగుతారని పవన్ కళ్యాన్ అన్నారు. జగన్ లాంటి వారిని, ఇలాంటి క్రిమినల్స్ ను దగ్గరకు కూడా రానివ్వరు అన్నారు.
ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని చూశారని, కానీ ఏం చేశాడో మీ అందరికీ తెలుసు అన్నారు. తాను మాట ఇచ్చానంటే దానిపై నిలబడేవాడినని, దశాబ్దం పాటు ప్రజల కోసం కష్టపడిన వాడినన్నారు పవన్ కళ్యాణ్.
ఏపీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికే పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయని, పనులు కొనసాగించే ఎప్పుడో ప్రాజెక్టు కల సాకారం అయ్యేదన్నారు. పనులు చేయలేక, పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకున్న జగన్ పోలవరానికి తీరని అన్యాయం చేశాడని పవన్ ఆరోపించారు.
పత్తిపాడులో మాఫియా డాన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆగడాలు ఎక్కువ అయ్యాయని, లాటరైట్ ముసుగులో బాక్సైడ్ తవ్వుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ద్వారంపూడి తమ్మడు లంపక లోవ గ్రామంలో వీర భద్రారెడ్డి తన వీరభద్ర కంపెనీకు అక్రమంగా గ్రావెల్ రవాణా చేశాడన్నారు.
కూటమి ప్రభుత్వంలో ప్రత్తిపాడు నియోజవకర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టిపెడతాం. ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ, పుష్కర, పోలవరం కాలువలపై లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్లకు కొత్తరూపు తీసుకొస్తాం అన్నారు.