Pawan Kalyan: పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్, భారీ ర్యాలీగా వెళ్లిన జనసేనాని
పిఠాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మ, జనసేన నేత నాగబాబు పాల్గొన్నారు. మంగళవారం నాడు భారీ ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు.
ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న ప్రభుత్వ దమనకాండకు చరమగీతం పలికే సమయం ఆసన్నమైందన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికే కాదు భవిష్యత్ తరాలకు ఎంతో కీలకమైనవని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
టీడీపీ, బీజేపీతో కలసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ముందుకు వెళ్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. 60 నుంచి 70 వేల మంది ప్రజల ఆశీర్వాదంతో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశానన్నారు పవన్ కళ్యాణ్.
జనసేన పార్టీ బలం పుంజుకున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేసి ముందుకు వెళ్లాం. మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం లాంటి 40 నియోజకవర్గాల్లో బలమైన ప్రజా నాయకులు పార్టీలో ఉన్నప్పటికీ పోటీ నుంచి విరమించుకోవాల్సి వచ్చిందన్నారు.
పిఠాపురంలోనూ బలమైన నాయకులు, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న నాయకులు వర్మ తన కోసం సీటు త్యాగం చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్
ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాల కోసమే. టీడీపీ నేత వర్మకు భవిష్యత్తులో ఉన్నత స్థానం లభించాలని కోరుకుంటూ దానికి నా వంతు కృషి ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు
కాకినాడ పార్లమెంటు అభ్యర్ధిగా టీ టైమ్ వ్యవస్థాపకుడు ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఎంపీగా ఎన్నిక అయితే మన ప్రాంతంలో ఉపాధి అవకాశాల కోసం, ఓఎన్జీసీ కాలుష్యం తదితర అంశాలపై బలంగా గళం విప్పుతారని జనసేనాని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ మాకు మద్దతు ఇచ్చిన బీజేపీ నాయకులు బుర్రా కృష్ణంరాజుకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతోందనా దీమా వ్యక్తం చేశారు
ఈ నెల మొదటి తేదీన సామాజిక పింఛన్లు ఇళ్లకు తీసుకువెళ్లి ఇవ్వకపోతే దాని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నట్టే అని ఆరోపించారు
ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ప్రభుత్వ అధికారులు అడ్డంకులు కలిగించకపోతే ఫించన్ ఇంటికే చేరుతుంది. ఈ ప్రభుత్వం చేతిలో నలిగిపోయిన మీడియాకి మేము అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు
గతంలో ముక్కోణపు పోటీ ఉంది. ఇప్పుడు ఉమ్మడిగా ముందుకు వెళ్లడం వల్ల సమస్యలపై మరింత బలమైన పోరాటానికి అవకాశం ఉంటుందన్నారు జనసేనాని
ప్రజల మద్దతుతో పిఠాపురంలో తాను, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు విజయం సాధిస్తారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు