In Pics: ఏపీ అసెంబ్లీలో రచ్చ! గవర్నర్ స్పీచ్ కాపీలు చింపి, ఎగరేసిన టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేడి అప్పుడే మొదలైంది. సమావేశమైన తొలిరోజే తెలుగు దేశం పార్టీ ఆందోళన బాట పట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగవర్నర్ ప్రసంగం జరుగుతున్నంత సేపు గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూనే ఉంది.
రాజ్యాంగ బద్దమైన సంస్థల తీర్పులను, దర్యాప్తులను ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా గవర్నర్ పట్టించుకోవడం లేదని టీడీపీ సభ్యులు విమర్శలు చేశారు.
పోడియం చుట్టుముట్టి గవర్నర్ బిశ్వభూషన్ స్పందించాలంటూ గట్టిగా అరుస్తూ ప్రసంగానికి అడ్డు తగిలారు. ప్రసంగం కాగితాలను చించి గాల్లోకి విసిరారు.
తెలుగు దేశం పార్టీ సభ్యులు చేస్తున్న ఆందోళనపై అధికార పార్టీ వైసీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది.
వర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ నేతలు ఆందోళన చేస్తారేమో అని అనుమానించిన మార్షల్స్ వారిని అటు నుంచి వెళ్లనీయలేదు.
మండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ వాళ్లపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు అసెంబ్లీ వచ్చే దారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మందడం చెక్‌పోస్టు వద్ద సభ్యులను పోలీసులు నిలువరించారు.
ఏపీ శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారి నేరుగా ప్రసంగించారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాలు వర్చువల్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు.