In Pics: చంద్రయాన్-3 శాటిలైట్ ఫోటోలు చూశారా? తొలిసారి విడుదల చేసిన ఇస్రో
హరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జులై-12న చంద్రయాన్-3 మిషన్ ప్రయోగిస్తారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV- Mk III నుండి చంద్రయాన్-3 మిషన్ ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. భూమిపై కాకుండా మరో ప్రదేశంలో తన వాహనాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యాన్ని పొందడమే ఈ మిషన్ ఉద్దేశం.
చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా, పర్యావరణం, ధర్మో ఫిజికల్ లక్షణాలు, భూకంప అవకాశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన సైంటిఫిక్ పరికరాల్ని పంపిస్తున్నారు.
చంద్రయాన్ -1 ను 2008 అక్టోబర్ 22 న పిఎస్ఎల్వి-XL రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ యాత్రలో ఇంపాక్టర్ ప్రయోగించారు. చండ్రుడిపై నీరు ఉందని ఈ ఇంపాక్టర్ కనుక్కుంది.
2019 జూలై 22 న మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జిఎస్ఎల్వి MK3 M1 వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రయాన్ 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టడంలో విఫలమైంది. అది క్రాష్ ల్యాండ్ అయింది.
చంద్రయాన్-3 పై ఇస్రో భారీ అంచనాలు పెట్టుకుంది. చంద్రయాన్-2 వైఫల్యాలను అదిగమించి దీన్ని సక్సెస్ చేయాలని నిర్ణయించారు ఇస్రో అధికారులు
జులై-12న చంద్రయాన్-3 ప్రయోగం మొదలవుతుంది. అయితే చంద్రయాన్ మిషన్ చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయినప్పుడే ఇది సక్సెస్ అయినట్టు లెక్క.