Murali Naik Final Rites: వీర జవానుకు కన్నీటి వీడ్కోలు, అధికార లాంఛనాలతో ముగిసిన మురళీ నాయక్ అంత్యక్రియలు
పాక్ సైన్యంతో పోరాడుతూ దేశ సరిహద్దులో ప్రాణ త్యాగం చేసిన శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియల్లో ఏపీ మంత్రులు పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ ఐటీ శాఖమంత్రి నారా లోకేష్, మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సవిత, తదితర నేతలు జవాను మురళీ నాయక్ కల్లితాండాకు వెళ్లి జవాను మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు.
మంత్రి నారా లోకేష్ వీర జవాను మురళీ నాయక్ పాడె మోశారు. దేశం కోసం పోరాడుతూ వీర మరణం పొందిన యువకుడు మురళీ నాయక్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు తరలివచ్చారు.
కుమారుడు, వీర జవాను మురళీ నాయక్ కు కన్నీటి వీడ్కోలు పలుకుతున్న తండ్రి శ్రీరాం నాయక్
ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పాటు వీర జవాను మురళీ నాయక్‌కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
జవాను మురళీ నాయక్ త్యాగాలను గుర్తుచేసుకుంటూ అమరవీరుడికి సెల్యూట్ చేస్తున్న ఏపీ మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సవిత, అధికారులు, గ్రామస్తులు, ప్రజలు
మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతి బాయ్, శ్రీరాం నాయక్ లను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పుత్ర శోకంలో ఉన్న జవాను తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
నేటి ఉదయం శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాలో అమర జవాను మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న వీర జవాను మురళీ నాయక్ తల్లిదండ్రులు
జవాను మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్. వ్యక్తిగతంగా తన ట్రస్ట్ నుంచి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల పొలంతో పాటు 300 గజాల నివాస స్థలం ఇస్తామని ప్రకటించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.
వీర జవాను మురళీ నాయక్ తన అభిమాని అని తెలిసి పవన్ కళ్యాణ్ మరింత భావోద్వేగానికి లోనయ్యారు. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడికి నివాళి అర్పించారు.
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు గ్రామానికి మురళీ నాయక్ పేరు పెడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించేది లేదని, ప్రధాని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదుల భరతం పడుతుందని.. అందుకు టీడీపీ, కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు మంత్రి నారా లోకేష్