Andhra Pradesh: వ్యవసాయ పనుల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బిజీ బిజీ
ఎప్పుడు రాజకీయాలతోను సభలు సమావేశాలు సమీక్షలతో బిజీ బిజీగా ఉండే మాజీమంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
వెంకటాపురంలోని పరిటాల సునీత స్వగ్రామంలో తమ వ్యవసాయ క్షేత్రంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని వరి నాట్లు నాటారు. ముందుగా భూమి పూజ చేసి కూలీలతో సమానంగా మడికట్లలో దిగి పంట పొలాల్లో పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆమె వరినట్లు వేశారు.
రాజకీయాల్లోకి రాక ముందు వరకు మాజీ మంత్రి పరిటాల సునీత ఇంటి పనుల్లోనూ వ్యవసాయ పనుల్లోనూ చురుకుగా పాల్గొనేవారిని స్థానికులు పేర్కొన్నారు.
అనుకొని పరిణామాలతో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తమ సొంత గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో వీళ్ళు దొరికినప్పుడల్లా అక్కడ గడిపేందుకు ఆసక్తి చూపేవారు.
గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వేరుశనగ విత్తన పనుల్లో సునీత బిజీగా గడిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ తమ వ్యవసాయ పొలంలో వరి నాట్లు వేయడం చూపులను ఆకర్షించింది.
రాజకీయంగా ఎంత పని ఉన్నప్పటికీ తప్పకుండా తన వ్యవసాయ పొలంలో పనులు చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మాజీమంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో పని చేసేందుకు వచ్చిన కూలీలు కూడా ఉత్సాహంగా పని చేశారు.