In Pics: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని సీఎం జగన్ పర్యటించారు
బాధితులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన వారిని రూ.90 వేలు సాయం సరిపోదని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎంను బాధితులు కోరారు.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడారు
ఇళ్లు కోల్పోయిన వరద బాధితులు సీఎం జగన్ కు తమ బాధలు వివరించారు. వరదలతో సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
వరద బాధితులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండండని జగన్ హామీ ఇచ్చారు
ఇళ్లు నిర్మించే బాధ్యత తనదన్న సీఎం జగన్... అన్ని విధాలుగా ఆదుకుంటానని సీఎం జగన్ చెప్పారు.
వరదలతో సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందని బాధితులకు హామీ ఇచ్చారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని సీఎం చెప్పారు
రాజంపేట మండలంలోని మందపల్లి, పులపుత్తూరులో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు.
ఇసుక మేటలు ఉన్న రైతులు ప్రతి ఒక్కరికి హెక్టార్ కు రూ.12 వేలు ఇచ్చేట్లు చర్యలు తీసుకుంటామని, ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికి కూడా పరిహారం అందిస్తామని సీఎం జగన్ అన్నారు.
ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.90వేల సాయం సరిపోదని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ ను బాధితులు కోరారు
వరద ప్రభావిత ప్రాంతంలో చిన్నారితో సీఎం జగన్