Pawan Kalyan: 21వ తేదీ 21 మంది ఎమ్మెల్యేలు - తొలిసారి అసెంబ్లీలోకి జనసేనాని పవన్ కల్యాణ్, ఇవి కదా జనసైనికులకు బెస్ట్ మూమెంట్స్
ఏపీ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సాదర స్వాగతం లభించింది. ఆయన్ను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
అసెంబ్లీలో మెమెరబుల్ మూమెంట్. సుదీర్ఘ రాజకీయ అనుభవం, 14 ఏళ్లు సీఎంగా ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు, తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.
సీఎం చంద్రబాబు సభలో అడుగుపెట్టిన అనంతరం పవన్‌తో పాటు మిగిలిన సభ్యులు లేచి గౌరవించారు. ఈ క్రమంలో 'నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది' అంటూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు.
'పవన్ కల్యాణ్ అనే నేను దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా'.. ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆప్యాయంగా పలకరించారు.
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సంతకం చేస్తున్న పవన్ కల్యాణ్.