In Pics: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు
ఏపీలో పర్యటిస్తోన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకు ఇచ్చిన తేనీటి విందులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు.
ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం తేనీటి విందు ఇవ్వాలని నిర్ణయించడంతో సీజేఐ ఎన్వీ రమణ అంగీకరించారు. ఈ మేరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ తేనీటి విందును ఏర్పాటు చేశారు.
ప్రోటోకాల్ ప్రకారం ముందుగా సీఎం జగన్ సతీమణితో కలిసి నోవాటెల్ హోటల్లో బస చేసిన సీజేఐ ఎన్వీ రమణ వద్దకు వెళ్లి విందుకు ఆహ్వానించారు.
తేనీటి విందు కార్యక్రమంలో సీఎం జగన్
నోవాటెల్ హోటల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని పులివెందుల నుంచి తాడేపల్లి వచ్చిన వెంటనే.. జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికేందుకు నోవాటెల్‌కు వెళ్లారు.
తెలుగు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు
ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్ జస్టిస్‌లు, తెలుగు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు.
ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్ జస్టిస్‌లు, తెలుగు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు.
తేనీటి విందులో న్యాయమూర్తులతో సీజేఐ
ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేస్తున్న సీజేఐ
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు జ్ఞాపికను బహుకరించిన సీఎం జగన్