Nara Lokesh In Australia: సిడ్నీలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం, తెలుగు డయాస్పోరాలో పొల్గొనున్న ఏపీ మంత్రి
ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. సిడ్నీలో విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులు లోకేష్ కు స్వాగతం పలికారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంత్రి లోకేష్ ను స్వాగతిస్తూ సిడ్నీ నగరంలో టవర్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆస్ట్రేలియా టీడీపీ విభాగం నాయకులు మంత్రి లోకేష్ కు సాదరంగా ఆహ్వానం పలికారు.
సిడ్నీ చేరుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం ఆస్ట్రేలియా బృందం
తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ విజయ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్ ఆధ్వర్యంలో సిడ్నీ విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
బ్రిస్బేన్, క్యాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుండి సిడ్నీ వచ్చి మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐ లు
అందరినీ అప్యాయంగా పలకరించి, అందరితో ఫోటోలు దిగారు మంత్రి నారా లోకేష్.
ఈరోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ప్రాంగణంలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.
స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాలని మంత్రి లోకేష్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆ దేశ హై కమిషనర్ ఆహ్వానం పంపడంతో పర్యటనకు వెళ్లారు.
నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావాలని ఆస్ట్రేలియాలో పలు ప్రాంతాల్లో రోడ్ షోలలో నారా లోకేష్ పాల్గొననున్నారు
తన పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని పలు విశ్వవిద్యాలయాల్ని సందర్శించి అక్కడి మోడ్రన్ టీచింగ్ పద్ధతుల్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధ్యయనం చేస్తారు.