YS Jagan Bus Yatra: జగన్ బస్సు యాత్రలో అవే హైలెట్, చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ముద్దాడిన సీఎం
పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App12వ రోజు బస్సు యాత్ర గంటావారిపాలెం నుంచి ప్రారంభం అయింది. నిన్న రాత్రి జగన్ అక్కడే బస చేశారు.
గంటావారి పాలెం నుంచి సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల, విప్పెర్ల, నెకరికల్లు, దేవరంపాడు క్రాస్, కొండమోడు మీదుగా సాగింది.
బస్సు యాత్ర సాగుతున్న మార్గంలో జగన్ ను చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు జనం హాజరయ్యారు.
పలు చోట్ల గజమాలలతో స్వాగతం పలికారు. బస్సుపై నిలబడి జగన్ అభివాదం చేస్తుండగా భారీ క్రేన్లతో గజమాలలను సిద్ధం చేశారు.
అన్నవరప్పాడు వద్ద గుమ్మడికాయలతో కొందరు మహిళలు దిష్టి తీశారు.
స్కూల్ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
గంటావారిపాలెం రాత్రి బస వద్ద సీఎం జగన్ సమక్షంలో జనసేన, టీడీపీ కార్యకర్తలు కొంత మంది వైసీపీలో చేరారు.
విజయవాడ వెస్ట్ కు చెందిన జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో జగన్ సమక్షంలోనే చేరారు.
కొంత మంది రోజు కూలీలు, కార్మికులు, గృహిణులు, స్కూలు పిల్లలు, కాలేజీ యువతులు సీఎం జగన్ ను కలిశారు.
అవ్వా తాతలను సీఎం జగన్ ప్రేమతో ముద్దాడారు.
తన బస్సు ద్వారం వద్ద మెట్లపై కూర్చొని తనను చూసేందుకు వచ్చిన వారితో సంభాషించారు.
పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను సీఎం జగన్ పలకరించారు.
సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొండమోడు జంక్షన్ వద్దకు చేరుకుంది.
ఉదయం నుంచి తీక్షణమైన ఎండ కాస్తున్నా జన సందోహం ఆగలేదు.
ఎక్కడికక్కడ సీఎం జగన్‌కు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.