Zomato Sets Guinness World Record: జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో తోటి వారికి ఎలాంటి సాయం అందించవచ్చో ట్రైనింగ్ ఇచ్చింది సంస్థ. ముంబయిలో ఒకే చోట డెలివరీ ఏజెంట్స్‌ని పలిచి ఈ శిక్షణ అందించింది. ఒకేసారి 4,300 మందికి జూన్ 12వ తేదీన ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించింది. అతి పెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించి ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఈ మేరకు జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ట్వీట్ చేశారు. Emergency Heroes of India అనే క్యాప్షన్‌తో ఈ పోస్ట్ పెట్టారు. అందులో డెలివరీ పార్ట్‌నర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చే ఫొటోలతో పాటు గిన్నిస్ వరల్డ్ నుంచి వచ్చిన సర్టిఫికెట్‌నీ షేర్ చేశారు. ఇకపై జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్ కేవలం ఫుడ్‌ డెలివరీ చేయడమే కాకుండా అత్యవసర సమయాల్లో ఇలా సాయం కూడా అందిస్తారని దీపీందర్ గోయల్ వెల్లడించారు. దాదాపు 30 వేల మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిపారు. వీళ్లందరికీ నా సెల్యూట్ అని పోస్ట్ పెట్టారు. 


"ఒకే చోట 4,300 మందికి ఇలా ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. దాదాపు 30 వేల మంది ఈ ప్రాథమిక చికిత్సలో శిక్షణ పొందారు. ఇకపై వీళ్లంతా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడతారు. ఎమర్జెన్సీ హీరోలందరికీ నా సెల్యూట్"


- దీపీందర్ గోయల్, జొమాటో సీఈవో 






ఈ పోస్ట్‌కి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. కనీసం ఒక్కరి ప్రాణాలు కాపాడినా అది విజయమే అని మరికొందరు కామెంట్ చేశారు. చాలా మందిలో స్ఫూర్తి నింపుతున్నారని ఇంకొందరు ప్రశంసలు కురిపించారు. 


Also Read: PM Modi: మొత్తం బలగాలను దింపండి, ఉగ్రవాదుల్ని ఏరిపారేయండి - జమ్ముకశ్మీర్ ఉగ్రదాడులపై ప్రధాని