Youtube Server Down: మైక్రోసాఫ్ట్‌లో టెక్నికల్ గ్లిచ్‌తో ప్రపంచవ్యాప్తంగా పలు సర్వీస్‌లు ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఆ సమస్య తీరిపోయిందనుకుంటే ఇప్పుడు యూట్యూబ్ డౌన్ అయింది. దేశంలో పలు చోట్ల స్ట్రీమింగ్‌పై ప్రభావం పడింది. కోల్‌కత్తా, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఈ సమస్య తలెత్తినట్టు కొన్ని రిపోర్ట్‌లు వెల్లడించాయి. Downdetector వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే యూట్యూబ్ టీమ్ రంగంలోకి దిగి ఏం జరిగిందో పరిశీలిస్తోంది. ఇండియాలోనే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలోనూ యూజర్స్‌కి ఇదే సమస్య ఎదురవుతోంది యూట్యూబ్‌తో పాటు YouTube Studio కూడా పని చేయడం లేదు. మధ్యాహ్నం 1.41 గంటల నుంచి ఒక్కసారిగా సర్వర్ డౌన్ అయినట్టు తేలింది. నాగ్‌పూర్, పుణే, హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్‌లు యూట్యూబ్ పని చేయడం లేదని పోస్ట్‌లు పెట్టారు. దీనిపై యూట్యూబ్ వెంటనే స్పందించింది. 


"ఈ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మా టీమ్‌ ఇప్పటికే ఏం జరిగిందో పరిశీలిస్తోంది. మాకు ఏమైనా సమాచారం కావాలంటే మిమ్మల్ని తప్పకుండా అడిగి తెలుసుకుంటాం"


- యూట్యూబ్ 


 




యూట్యూబ్ స్పందించేలోగా సోషల్ మీడియాలో అప్పుడే మీమ్స్ మొదలయ్యాయి. చాలా మంది తీవ్ర అసహనంతో పోస్ట్‌లు పెట్టారు. #YoutubeDown హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్‌ చేయాలంటూ కొందరు నెటిజన్‌లు పోస్ట్‌లు పెట్టారు. యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ అవ్వడం లేదని, YT Studio లోనూ ఇదే సమస్య ఉందని మరి కొందరు చెప్పారు.