Quota for Disabled in Civils Row : వికలాంగులకు ఐఏఎస్ సర్వీస్ కేటాయింపుపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై కూడా స్మితా సభర్వాల్ స్పందించారు. ఎక్స్‌లో తన స్పందనపై చాలా మంది విమర్శలు చేస్తున్నారని.. ఐపీఎస్, రక్షణ వంటి కొన్ని రంగాల్లో ఈ కోటాను ఇంకా ఎందుకు అమలు చేయలేదో ఆందోళన చేస్తున్న వారు చర్చించాలన్నారు. ఐఏఎస్ కూడా ఇందుకు భిన్నం కాదన్నది తన వాదన అని స్పష్టం చేశారు.
ఐఏఎస్‌కు దివ్యాంగుల కోటా అవసరం లేదన్న స్మితా సబర్వాల్
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఉదంతం దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. ఈ క్రమంలో తాను దివ్యాంగులను గౌరవిస్తున్నాను అంటూ స్మిత సబర్వాల్ తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమించదని గుర్తు చేశారు. వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా అని కూడా ప్రశ్నించారు. ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుందని ఇలాంటి పనులకు దివ్యాంగుల ఎందుకవసరం అని ప్రశ్నించారు.
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన - వైఎస్ జగన్, రఘురామ మధ్య సంభాషణ, ఏం మాట్లాడుకున్నారంటే?
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు
స్మితా సబర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై డిసేబుల్ కమ్యూనిటీతో పాటు మరికొంత మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఐఏఎస్ సాధించిన డిసేబుల్ కమ్యూనిటీ వారు కూడా మంచి పనితీరు కనబరుస్తున్నారని ఐరా సింఘాల్ వంటి ఐఎఎస్‌లను గుర్తు చేస్తున్నారు. అసలు సమస్య మానసిక వైకల్యమేనని మండిపడుతున్నారు. సివిల్ శిక్షణలో పేరు తెచ్చుకున పలుమార్లు ర్యాంకులు తెచ్చుకున్న బాలలత తో పాటు డిసేబుల్ కమ్యూనిటీకి చెందిన యాక్టివిస్టులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని..దానిపై చర్చ జరగాలని స్మితా సబర్వాల్ అంటున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ - చంద్రబాబు సైలెంట్‌గా పవర్ చూపించారా ?