Most Popular CM of India: నిన్న మొన్నటి వరకూ దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు అనగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడేది. అన్ని సర్వేల్లోనూ ఆయన పేరే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండేది. కానీ ఇప్పుడు యోగిని వెనక్కి నెట్టారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఈ లిస్ట్‌లో ఆయనకు 52.7% పాపులారిటీ రేటింగ్ వచ్చింది. ఆ తరవాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి 51.3% రేటింగ్‌ వచ్చింది. అలా రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎవరికి ఎంత పాపులారిటీ ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించారు. ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఆయనకు 48.6% రేటింగ్ వచ్చింది. 42.6% పాపులారిటీ రేటింగ్‌తో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా 41.4% రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచారు. రాష్ట్ర ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ ఉందని ఈ సర్వే వెల్లడించింది. మాణిక్ సాహా చాలా సింపుల్‌గా ఉంటారని, ఆయన నిజాయతీ, అంకితభావం తమకెంతో నచ్చాయని త్రిపుర ప్రజలు చెప్పినట్టు ఈ సర్వే తెలిపింది. ఇక ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న నవీన్ పట్నాయక్ Biju Janata Dal (BJD) పార్టీ ఫౌండర్స్‌లో ఒకరు. దాదాపు 22 ఏళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ యూపీకి 22వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 


యోగి ఆదిత్యనాథ్ రికార్డు..


యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. యూపీకి ఎక్కువ కాలం పాటు సీఎంగా ఉన్న నేతగా రికార్డుకెక్కారు. 5 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న యోగి...గత ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ కాలం పాటు ఆ పదవిలో కొనసాగుతున్నారు. 5 సంవత్సరాల 347 రోజులుగా సీఎం కుర్చీలో ఉన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో ఈ డా. సంపూర్ణానంద్ యూపీకి 5 సంవత్సరాల 345 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. 1954డిసెంబర్ 18 నుంచి 1960 డిసెంబర్ 6వ తేదీ వరకూ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరవాత ఎక్కువ కాలం పాటు ఈ పదవిలో కొనసాగిన  వారిలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. 5 సంవత్సరాల 4 రోజుల పాటు కొనసాగారు. తరవాత బీఎస్‌పీ చీఫ్ మాయావతి 4 సంవత్సరాల 307 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. మొత్తం నాలుగు సార్లు ఆమె సీఎం అయ్యారు. ములాయం సింగ్ యాదవ్ 3 సంవత్సరాల 257 రోజుల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యోగి ఆదిత్యనాథ్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతే కాదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీకి రావడానికి కారణమూ ఆయనే. రాష్ట్రంలో గూండాయిజం, రౌడీయిజాన్ని పూర్తి స్థాయిలో అణిచి వేశారు. గ్యాంగ్‌స్టర్‌లను ఎన్‌కౌంటర్ చేయించారు. యోగి వచ్చిన తరవాతే రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్న పేరు సంపాదించుకున్నారు. 


Also Read: రాజ్యసభ టికెట్ అడిగిన కమల్ నాథ్, ఇవ్వని హైకమాండ్ - అందుకే అలిగారా?