Youtube New CEO: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ కు నూతన సీఈఓగా అమెరికాకు చెందిన భారత సంతత వ్యక్తి నీల్ మోహన్ నియమితులయ్యారు. సంస్థకు అత్యధిక కాలం సీఈఓగా పని చేసిన సూసన్ వొజిసికి పదవి నుంచి వైదొలిగారు. దీంతో యూట్యూబ్ యాజమాన్యం నీల్ మోహన్ ను కొత్త సీఈఓగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆయనకు బాధ్యతలు అప్పగించింది. అయితే నీల్ మోహన్ ఇండియన్-అమెరికన్. ఈయన ప్రస్తుతం యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. మోహన్ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2008వ సంవత్సరంలో ఆయన గూగుల్ లో పని చేశారు. భారతీయులు దేశవిదేశాల్లో టాప్ కంపెనీల్లో మంచి పొజిన్లలో ఉన్నారు. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓగా శంతను నారాయణ్ పని చేస్తున్నారు. వీరి సరసన ఇప్పుడు నీల్ మోహన్ కూడా చేరారు.






యూట్యూబ్ నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న నీల్ మోహన్ కు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు. సుసాన్ వొజిసికి సంస్థకు చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన యూట్యూబ్ ను అత్యంత విజయవంతంగా ముందుకు నడిపించారని ప్రకటనలో పేర్కొన్నారు. పదవి నుంచి తప్పుకుంటున్న సూసన్ సంస్థ ఉద్యోగులకు లేఖ రాశారు. కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగాత ప్రాజెక్టులపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సూసన్ వొజిసికికి యూట్యూబ్ తో విడదీయరాని బంధం ఉంది.





యూట్యూబ్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ లో గత  ఏళ్లుగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన యూట్యూబ్ కు తొమ్మిదేళ్ల నుంచి సీఈఓగా పని చేస్తున్నారు. ఆల్ఫాబెట్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్ సూసన్ సేవలను కొనియాడారు. గూగుల్ చరిత్రలో సూసన్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సూసన్ సీఈఓగా ఉన్న సమయంలో యూట్యూబ్ అత్యున్నత స్థాయికి చేరింది. వారి సారథ్యంలోనే గతేడాది యాడ్స్ ద్వారా యూట్యూబ్ కు 29.2 బిలియన్ల ఆదాయం చేకూరింది.